Minister Sridhar Babu | హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ).. స్థానిక భాగస్వామి స్టోన్క్రాఫ్ట్తో కలిసి హైదరాబాద్‌కు దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రతిపాదిత ఫోర్త్‌సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే వచ్చే పదేండ్లలో 10వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన పీజీఏ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమల ఏర్పాటుకు పీజీఏ, స్టోన్‌క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తంచేశాయని చెప్పారు. పీజీఏ ప్రస్తుతం ముంబైలో గోల్ఫ్‌సిటీ నిర్మాణం చేపడుతోందని, హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని తెలిపారు.
హబ్‌లో పానాసోనిక్ ఇన్నోవేషన్ చాలెంజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): పానాసోనిక్ ఇండియా సహకారంతో ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఈ లింకు (bit.ly/ 3U19H3d)లో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మెంటర్షిప్ మద్దతుతో పాటు తనవంతుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు చెప్పారు.