శంషాబాద్ రూరల్, డిసెంబర్ 3: హైదరాబాద్ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. శంషాబాద్ ఎయిర్‌కార్గోకు ‘టైం క్రిటికల్ లాజిస్టిక్స్ సొల్యుషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఈయర్ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్ అవార్డు లభించింది. చెన్నైలో జరిగిన 5వ సౌత్ ఈస్ట్ ఎయిర్‌కార్గో కాంక్లెవ్ అండ్ అవార్డు-2024లో ఈ అవార్డును కంపెనీ ప్రతినిధులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ పరిష్కరాలను అందించడంలో నిబద్ధతను పాటించడం వల్లనే ఈ అవార్డులు లభిస్తున్నాయన్నారు. ఈ అవార్డు రాకతో సంస్థపై అంతర్జాతీయ కస్టమర్లకు నమ్మకం పెరిగిందని, అలాగే మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి నిధులు వెచ్చించనున్నట్లు చెప్పారు.