Gold Rate | గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) రూ.650 తగ్గి రూ.57,550 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందు ట్రేడింగ్‌లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.58,200 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1800 తగ్గి రూ.71,500కి పడిపోయింది. కామెక్స్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు పడిపోయాయి. దేశీయంగా బులియన్ మార్కెట్లు సోమవారం పని చేయలేదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌నీత్ దమానీ తెలిపారు.
అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 1825 డాలర్లకు, ఔన్స్ వెండి 21.10 డాలర్లకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ రిజర్వు సుదీర్ఘకాలం వడ్డీరేట్లు పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో ట్రెజరీ బాండ్ల విలువ దశాబ్ధాల క్రితం గరిష్ట స్థాయికి దూసుకెళ్లిందని హెచ్డీఎఫ్సీ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఇదిలా ఉంటే ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) రూ.683 తగ్గి రూ.56,917 వద్ద స్థిర పడ్డాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ ధర రూ.683 తగ్గి రూ.56,917 వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్ (న్యూయార్క్)లో ఫ్యూచర్స్ గోల్డ్ ధర ఔన్స్‌పై 0.36 శాతం తగ్గి 1840.50 డాలర్లు పలికింది.