న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బంగారం క్రమంగా దిగొస్తున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.475 తగ్గి రూ.56,345కి దిగొచ్చింది. కిలో ధర రూ.200 తగ్గి రూ.65,925గా ఉన్నది.
ఇటు హైదరాబాద్‌లోనూ స్వల్పంగా తగ్గిన 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,160గా నమోదవగా, 22 క్యారెట్ ధర రూ.52,400గా నమోదైంది. రూ.500 తగ్గిన కిలో వెండి రూ.72 వేలుగా ఉన్నది.