న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగారం ధరలు ( Gold price ) స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.283 తగ్గి రూ.46,570కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.46,853 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఢిల్లీలో స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.661 తగ్గి రూ.65,514కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,175 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,799 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.15 అమెరికన్ డాలర్లు పలికింది.