Gold Rate slips | పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న వేళ.. భారతీయ వనితలకు గుడ్ న్యూస్.. తులం బంగారం ధర నెల రోజుల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.960 (2%) తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాముల ధర రూ.46,651కి చేరుకున్నది. కిలో వెండి ధర కూడా మూడు శాతం (రూ.3000) తగ్గి రూ.64,975లకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రెండు శాతానికి పైగా దిగి వచ్చి 1765.30 డాలర్ల వద్ద నిలిచింది. అంచనాలను మించి జాబ్ డేటా మెరుగు పడటంతో అమెరికా ప్రభుత్వ బాండ్లతోపాటు డాలర్ పుంజుకున్నాయి.
టెక్నికల్‌గా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1800 డాలర్ల వద్ద తచ్చాడుతుండవచ్చు. 1798-1790 డాలర్ల వద్ద మద్దతు లభించవచ్చునని క్యాపిటల్ వయా కమోడిటీస్ లీడ్ ప్రతినిధి క్షితిజ్ పురోహిత్ చెప్పారు. బంగారం మాదిరిగానే ఔన్స్ వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడ్ కావచ్చునన్నారు.