Gold Rate Hike | అమెరికా సుంకాలపై ఆందోళనల మధ్య ప్రపంచవ్యాప్తంగా భారీగా అమ్మకాల బంగారం ధరలు పెరిగాయి. బుధవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 పెరిగి తులానికి రూ.99,170కి చేరుకుంది. వరుసగా రెండురోజుల్లో బంగారం ధర రూ.1,700 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి తులానికి రూ.98,600కి చేరుకుంది. ఇక వెండి ధరలు కిలోకు రూ.1,04,800 పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రవీకరించింది. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఎఫ్ఎక్స్ అండ్ కమోడిటీ హెడ్ అభిలాష్ కోయిక్రా మాట్లాడుతూ.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం ధరలు సానుకూలంగా మొదలయ్యాయన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తర్వాత భౌగోళిక రాజకీయ రిస్క్ ప్రీమియం తగ్గడం వల్ల జూన్ నెలలో ఇటీవల గరిష్ట స్థాయికి పడిపోయిందన్నారు.
చైనా, టర్కీ నేతృత్వంలో జూన్‌లో కేంద్ర బ్యాంకులు 50 టన్నులకుపైగా బంగారాన్ని కొనుగోలు చేశాయని తెలిపారు. అదే సమయంలో యూరప్‌లో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య బంగారం ఈటీఎఫ్‌లలో కొత్త పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై ఆందోళన మధ్య డిమాండ్ కారణంగా బంగారం పెరిగిందని ధర పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ చెప్పారు. ఇది బంగారం ధరలకు మరింత మద్దతు ఇచ్చిందన్నారు. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్సుకు స్వల్పంగా 3,342.44 పెరిగింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య బంగారం స్థిరంగా ఉందని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా అన్నారు. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా ప్రకారం.. పెట్టుబడిదారులు యూఎస్ లేబర్ డేటా కోసం నిరీక్షిస్తున్నారని.. ఏడీపీ ఉపాధి నివేదిక నేడు విడుదల కానున్నది. వ్యవసాయేతర జీతాలు, నిరుద్యోగ రేటు డేటా గురువారం విడుదల కాబోతున్నది. ఈ డేటాతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చర్యలను సూచించనున్నాయి.