Gold Price Hike | రూపాయి పతనం నేపథ్యంలో వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడంతో తులం ధర రూ.89,350కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.250 పెరిగి పది గ్రాములకు రూ.88,950కి చేరుకుంది. ఇక వెండి ధరలు మాత్రం రూ.500 తగ్గి కిలోకు రూ.99,500 పలుకుతున్నది. డాలర్ ఇండెక్స్ పెరుగుల కారణంగా వెండి ధర తగ్గిందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి పేర్కొన్నారు. ట్రంపు సుంకాల భయాలు, ఒత్తిడి కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సైతం ఇబ్బందులుపడుతున్నాయి. అయితే, యూఎస్ ట్రెజరీ దిగుబడిలో తిరోగమనం వెండి ధరలు పెరుగుదల తక్కువగానే ఉండవచ్చని అంచనా. వాణిజ్య సుంకాలపై అనిశ్చితి మధ్య.. యూఎస్ డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి 51 పైసలు తగ్గి రూ.87.23 వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ.275 పెరిగి రూ.86,459కి చేరుకుంది.
అదే సమయంలో కామెక్స్ బంగారం 2,930 నుంచి 2,955 మధ్య ట్రేడయ్యింది. మరోవైపు మార్చి డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలోకు రూ.241 పెరిగి రూ.95,330కి చేరుకుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. మంగళవారం విడుదల కానున్న సీబీ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్, రిచ్మండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌తో సహా స్థూల డేటా.. బులియన్ ధరలకు దిశానిర్దేశం చేసే యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌లోని కొంతమంది సభ్యుల ప్రసంగాల కోసం వ్యాపారులు ఎదురు చూస్తున్నారన్నారు. దేశంలోని వివిధ నగరాల్లోని ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.80,750 ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి ధర రూ.88,090 ధర పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం రూ.80,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.88,090 ధర ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.80,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.88,090 పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1.08లక్షలు పలుకుతున్నది.