Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర రూ.350 వృద్ధి చెంది రూ.72,850కి చేరుకున్నది. గురువారం సెషన్ లో తులం బంగారం ధర రూ.72,500 వద్ద స్థిర పడింది. ఇదిలా ఉంటే కిలో వెండి ధర మాత్రం రూ.200 తగ్గింది. దేశ రాజధానిలో కిలో వెండి ధర శుక్రవారం రూ.86 వేల వద్ద ముగిసింది. గురువారం కిలో వెండి ధర రూ.86,200 వద్ద స్థిర పడింది.
యూఎస్ ఎకనమిక్ డేటా బలహీన పడటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. దీనివల్లే బంగారం ధరలు పెరిగాయని బులియన్ వ్యాపారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు తోడు దేశీయంగా బంగారం, వెండి దిగుమతిపై సుంకం తగ్గించడంతో బంగారం కొనుగోళ్లకు ఆదరణ పెరిగిందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా యూఎస్ ద్రవ్యోల్బణం నిలకడగా కొనసాగితే, సెప్టెంబర్ ప్రారంభంలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు.
అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 26.60 డాలర్లు వృద్ధి చెంది 2507.40 డాలర్ల వద్ద స్థిర పడింది. ఔన్స్ వెండి ధర సైతం 2.01 శాతం పెరిగి 29.05 డాలర్లకు చేరుకున్నది. ఆసియాలో 2023లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన చైనా సెంట్రల్ బ్యాంకు.. మే నుంచి కొనుగోళ్లు తగ్గాయి. వరుసగా రెండో నెల జూన్ లో బంగారం కొనుగోళ్లు పెరగలేదు.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
Stocks | ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. !
UPI Payments | వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
Bank of England | 5శాతం వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. 16 ఏండ్ల గరిష్టం నుంచి కోత..!