Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.250 పెరిగి రూ.78,850లకు చేరుకున్నది. మంగళవారం తులం బంగారం ధర రూ.78,600 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర వరుసగా మూడో సెషన్ లోనూ రూ.300 వృద్ధి చెంది రూ.90,800లకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,500 వద్ద ముగిసింది. ఇక గురువారం 99.5 శాతం స్వచ్ఛత గత బంగారం తులం ధర రూ.250 పెరిగి రూ.78,450లకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.442 వృద్ధితో రూ.76,712 వద్ద స్థిర పడింది. మార్చి వెండి డెలివరీ కిలో ధర రూ.343 పెరిగి రూ.89,669లకు చేరుకున్నది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 9.10 డాలర్లు పుంజుకుని 2664.60 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 30.34 డాలర్లు పలికింది.