Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు గురువారం ఫ్లాట్‌గా కొనసాగాయి. కిలో వెండి మాత్రం రూ.300 పెరిగింది. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.61,210 వద్ద కొనసాగుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.75,300 వద్ద నిలిచింది. బుధవారం కిలో వెండి ధర రూ.75 వేల వద్ద కొనసాగింది.
గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్స్ బంగారం ధర 1967 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.50 డాలర్ల వద్ద ట్రేడయింది. బుధవారం స్థాయిలోనే గురువారం బంగారం ధరలు కొనసాగాయి. ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లపై అమెరికా మాక్రో డేటా ప్రభావం చూపుతుందని భావిస్తున్నామని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
మరోవైపు, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ధర స్వల్పంగా రూ.151 పెరిగింది. గురువారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో స్పాట్ గోల్డ్‌కు డిమాండ్ పెరగడంతో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.151 పెరిగి రూ.60,262 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ లో ఔన్స్ బంగారం ధర 0.25 శాతం పెరిగి 1969.20 డాలర్లు పలికింది.