Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.83,050లతో తాజా జీవిత కాల గరిష్టం నమోదు చేసింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.76,050 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,00,500లకు చేరుకున్నది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో తులం బంగారం (24 క్యారట్స్) రూ.75,515 పలికితే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం రూ.75,213లకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.89,882 వద్ద స్థిర పడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.80,560 పలికితే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.73,850 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.1.06 లక్షలు పలికింది.