Gold Rates | హైదరాబాద్ : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి పరుగులకు గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఆల్ టైం హైలెవల్కు బంగారం ధరలు చేరాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలను చూసి పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇక భవిష్యత్లో బంగారం కొనలేమా..? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,04,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,330 గా ఉంది. నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1150, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1260 ఎగబాకింది. కేజీ వెండి ధర రూ. 1,49,000లకు చేరింది. నిన్నటితో పోల్చితే రూ. 1000 పెరిగింది.
చెన్నై నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,05,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,550 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,04,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,480 గా ఉంది.