Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ధగధగ మెరుస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలతోపాటు పెండ్లిండ్లు, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.64,860 పలికితే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.60 వేల వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.76,700 పలుకుతోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు రూ.58,200 వద్ద స్థిర పడింది. 24 క్యారెట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.63,400 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌తోపాటు చెన్నైలో కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.80,700 వద్ద స్థిర పడింది. చెన్నైలో పది గ్రాములు (22 క్యారెట్స్) బంగారం ధర రూ.50 పెరిగి రూ.58,800 వద్ద స్థిర పడితే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.60 పెరిగి రూ.64,150 వద్ద స్థిర పడింది.
మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.58,200 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.63,490 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.79,200 వద్ద నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.58,350 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.63,640 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.79,200 వద్ద స్థిర పడింది.