Gold Rates | పండుగల సీజన్, పెండ్లిండ్లతోపాటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. శనివారం బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,490 పలికింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధర రూ.660 పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 పెరిగి రూ. 57,400లకు చేరుకున్నది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు బులియన్ మార్కెట్లో శనివారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,420 వద్ద, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.58,500 పలికింది. కిలో వెండి ధర రూ.73,300 వరకూ చేరుకున్నది.
దేశ రాజధాని ఢిల్లీ, ముంబైల్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.660 పెరిగి రూ.62,770, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 పెరిగి రూ.57,550 వద్ద ముగిసింది. ఢిల్లీతోపాటు ముంబైలో కిలో వెండి ధర రూ.74,600 వద్ద నిలిచింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.660 పెరుగుదలతో రూ.62,620, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.57,400 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.74,600 వద్ధ స్థిరంగా కొనసాగింది.