Gold Price | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. కానీ..పెరిగి పోతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక మాంద్యం ప్రభావం.. డాలర్ విలువ, యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం దరిమిలా బంగారం విలువ రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పుడు 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.63 వేలకు చేరువలోకి వచ్చేసింది. హైదరాబాద్లో గురువారం రూ.540 పెరిగి రూ.62 వేల మార్క్ దాటి, రూ.62,180 వద్ద నిలిచింది. చెన్నైలో రూ.62,730 పలికింది. హైదరాబాద్ నగరంలో ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర 57 వేల వద్ద స్థిర పడింది.
నగరం —— 22 క్యారట్లు —- 24 క్యారట్లు
చెన్నై ——- రూ.57,500 — రూ. 62,730
ముంబై —— రూ.57,000 — రూ.62,180
ఢిల్లీ ——— రూ.57,150 —- రూ.62,330
కోల్ కతా —- రూ.57,000 — రూ.62,180
బెంగళూరు — రూ.57,050 — రూ.62,230
హైద్రాబాద్ — రూ.57,000 — రూ.62,180
త్రివేండ్రం — రూ.57,000 — రూ.62,180
జైపూర్ ——– రూ.57,150 —- రూ.62,230
విజయవాడ— రూ.57,000 —- రూ.62,180
విశాఖపట్నం- -రూ.57,000 —- రూ.62,180
ఈరోడ్ ——— రూ.57,500 —– రూ.62,730