Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బలమైన డిమాండ్ మధ్య బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల రూ.300 పెరిగి తులం రూ.1,29,700కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి సైతం రూ.300 పెరిగి రూ.1,29,100కి చేరుకుంది. మరో వైపు వెండి దిగివచ్చింది. రూ.1000 తగ్గి కిలోకు రూ.1,63,800కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్సుకు 4,077.35 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. వెండి ఔన్సుకు 0.66 శాతం పెరిగి 50.89 డాలర్లకు చేరుకుంది.
మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ.. డాలర్ బలపడడంతో బంగారం పెరుగుదల పరిమితంగా ఉందని.. దాంతో స్పాట్ గోల్డ్ ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోందన్నారు. తైవాన్‌పై చైనా చేసిన వ్యాఖ్యలతో డ్రాగన్-జపసీస్ ఉద్రిక్తలు ప్రతికూలతలను తగ్గించాయన్నారు. ఆగ్మాంట్ పరిశోధన విభాగాధిపతి రెనిషా చైనాని మాట్లాడుతూ.. గత వారం మార్కెట్లో భారీ అమ్మకాలు జరిగాయన్నారు. డిసెంబర్లో వడ్డీ రేట్ల అంచనాలు తగ్గాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యల ఫలితంగా బంగారం ధరలు 2.5శాతం, వెండి ధరలు 5.5శాతం తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల పసిడి రూ.1,25,400 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,14,950 వద్ద ట్రేడవుతున్నది. ఇక కిలో వెండి రూ.1,73,000 పలుకుతున్నది.