హైదరాబాద్, జూలై 6: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండటం, గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర మళ్లీ 74 వేలకు చేరవవుతున్నది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ తులం ధర మరో రూ.710 అధికమై రూ.73,800కి చేరుకున్నది. అంతకుముందు ఈ ధర రూ.73 వేలుగా ఉన్నది. అటు 22 క్యారెట్ ధర కూడా రూ.650 ఎగబాకి రూ.67,650 పలికింది. గత పది రోజుల్లో వెయ్యి రూపాయలకు పైగా పెరిగినట్లు అయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,600 ఎగబాకి రూ.99,300కి చేరుకుంది.