న్యూఢిల్లీ, నవంబర్ 19: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు భారీగా పుంజుకోవడం వల్లనే దేశీయంగా అధికమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,500 ఎగబాకి రూ.1,27,300 పలికింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో ఎగబాకి రూ.1,26,700కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 46.42 డాలర్లు పెరిగి 4,114 డాలర్లకు చేరుకోగా, వెండి 52.29 డాలర్లకు చేరుకున్నది.
హైదరాబాద్‌లో కాగ్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
న్యూఢిల్లీ, నవంబర్ 19: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)..హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది. విభాగాల్లో అధునాతన నైపుణ్యాలు, ప్రామాణికమైన అధిక-నాణ్యత ఆర్థిక ఆడిట్ పద్దతులను పెంపొందించడానికి ఈ సెంటర్‌ను నెలకొల్పబోతున్నట్టు కాగ్ డిప్యూటీ ఏఎం బజాజ్ తెలిపారు. ఆర్థిక ఆడిటింగ్‌లో నూతన ఆవిష్కరణలు, పరిశోధన, వృత్తిపరమైన వృద్ధిలో ఈ జాతీయ కేంద్రం ముందంజలో ఉండాలని యోచిస్తున్నట్టు చెప్పారు.