న్యూఢిల్లీ, జూలై 24 : బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన పుత్తడి 10 గ్రాముల విలువ రూ.1,400 పడిపోయి రూ.99,620గా ఉన్నది. అలాగే కిలో వెండి రేటు రూ.3,000 క్షీణించి రూ.1,15,000 వద్ద నిలిచింది. బుధవారం ఒక్కరోజే రూ.4,000 ఎగిసి ఆల్టైమ్ హైని తాకుతూ రూ. 1,18,000 పలికిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం రేటు రూ. 1,360 పతనమై రూ. 1,00,970గా నమోదైంది.
22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.1,250 దిగి రూ. 92,550గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 3,362.88 డాలర్లుగా, వెండి 39.05 డాలర్లుగా ఉన్నాయి. ఆయా దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాల్ని చేసుకుంటుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని, దీంతో డిమాండ్ పడిపోయి ధరలు క్షీణిస్తున్నాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.