సోమవారం 30 మార్చి 2020
Business - Mar 21, 2020 , 00:30:59

పసిడి పైపైకి

పసిడి పైపైకి

  • 41 వేలు దాటిన పుత్తడి 
  • రూ.1,400 పెరిగిన తులం

న్యూఢిల్లీ, మార్చి 20:  బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు అనూహ్యంగా ఎగబాకడంతో ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.1,395 అధికమై రూ.41,700 పలికింది. గడిచిన రెండు నెలల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. గురువారం పసిడి ధర రూ.40,310 స్థాయిలో ఉన్నది. పసిడితోపాటు వెండి మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర ఏకంగా రూ.2,880 పెరిగి రూ.38,100కి చేరుకున్నది. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,514 డాలర్లకు చేరుకోవడంతో ఒక్కసారిగా దేశీయ పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. 


logo