న్యూఢిల్లీ, డిసెంబర్ 5: తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పరుగందుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,300 ఎగబాకి రూ.1,32,900కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,31,600గా ఉన్నది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ఏకంగా రూ.3,500 ఎగబాకి రూ.1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర భారీగా పెరిగి 4,250 డాలర్లు పలుకగా, వెండి 58.60 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.