న్యూఢిల్లీ, అక్టోబర్ 1 : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. బుధవారం దేశీయ మార్కెట్లో మరింత పెరిగి నూతన గరిష్ఠాలను అధిరోహించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,21,100 పలికింది.
మంగళవారం ముగింపుతో చూస్తే రూ.1,100 ఎగిసింది. ఇక హైదరాబాద్లో తులం 24 క్యారెట్ రేటు రూ.1,800 పుంజుకొని రూ.1,19,240గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.1,650 పెరిగి రూ.1,09,300గా ఉన్నది. కిలో వెండి ధర రూ.1,50,500 వద్ద యథాతథంగా ఉన్నది.