న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బంగారం ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర మరో రూ.250 అందుకొని రూ.63,750 పలికింది. అంతకుముందు ఇది రూ.63,500గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలు రూ.350 అధికమయ్యాయి. కిలో ధర రూ.79,100 నుంచి రూ.79,450 పలికినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఇటు హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.220 అందుకొని రూ.63,710కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.200 పెరిగి రూ.58,400 పలికింది. రూ.300 పెరిగిన కిలో వెండి రూ.81 వేల మైలురాయికి చేరుకున్నది.