న్యూఢిల్లీ, జనవరి 1: గతకొద్ది రోజులుగా క్రమేణా క్షీణిస్తున్న బంగారం ధరలు.. గురువారం తిరిగి పుంజుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.640 పెరిగి రూ.1,38,340గా నమోదైంది. అంతకుముందు 3 రోజుల్లో రూ.4,600 పతనమైన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్లో 24 క్యారెట్ తులం రూ.170 పెరిగి రూ.1,35,060గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.150 అందుకుని రూ.1,23,800 పలికింది.
ఇదిలావుంటే దేశ రాజధాని నగరంలో కిలో వెండి ధర రూ.1,600 పడిపోయింది. రూ.2,37,400 వద్ద స్థిరపడింది. బుధవారం కూడా రూ.2,000 తగ్గిన సంగతి విదితమే. అయితే మంగళవారం ఆల్టైమ్ హైని తాకుతూ కిలో రూ.2,41,000 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 28 డాలర్లు తగ్గి 4,310.89 డాలర్లుగా ఉన్నది. గత ఏడాది 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.58,750, కిలో వెండి రేటు రూ.1,49,300 ఎగబాకాయి.