న్యూఢిల్లీ, మే 2 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో పుత్తడి ధర రూ.96 వేల మార్క్‌ను అధిగమించింది. ఢిల్లీలో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,080 ఎగబాకి రూ.96,800 పలికింది. స్థానిక ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసొచ్చింది. పసిడితోపాటు కిలో వెండి రూ.1,600 ఎగబాకి రూ.97,100 పలికింది.