న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపారు. ఫలితంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,300 తగ్గి రూ.1,13, 800కి దిగొచ్చింది.
మంగళవారం పదిగ్రాముల పుత్తడి ధర రూ.1,800 ఎగబాకి రికార్డు స్థాయి రూ.1,15,100కి చేరుకున్న విషయం తెలిసిందే. బంగారంతోపాటు వెండి ధర రూ.1,670 తగ్గి రూ.1,31, 200కి దిగొచ్చింది.