రెండు నెలల కనీస స్థాయికి బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు.. అనుకున్నదానికన్నా ముందుగానే ఉండొచ్చునన్న ప్రకటనతో బాండ్లపై రాబడి పెరిగింది. దీంతో డాలర్ విలువ కూడా ఎగబాకుతున్నది. ఫలితంగా మరో రెండు, మూడు వారాలపాటు పసిడి ధర స్తబ్దుగానే ఉండే అవకాశం ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పుత్తడి ధర గత వారం 2 శాతం పతనమై 1,795 డాలర్ల వద్ద ముగిసింది. అయితే స్పాట్ గోల్డ్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. దీంతో ధరలు మరింత పతనం కావడం కన్నా స్థిరంగా ట్రేడ్ అయ్యే అవకాశాలే ఎక్కువ.