న్యూఢిల్లీ, జనవరి 13 : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకపోతున్నాయి. న్యూఢిల్లీలో బంగారం ధర రూ.1.45 లక్షల మైలురాయికి చేరుకున్నది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.400 పెరిగి ఆల్‌టైం హైకీ చేరుకున్నది. మరోవైపు, వెండి స్పీడ్ ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2.71 లక్షలకు చేరుకున్నది. కిలో ధర రూ.6 వేలు పెరిగినట్టు అయింది.
సోమవారం రూ.15 వేలు లేదా ఆరు శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల్లోనే వెండి ఏకంగా రూ.21 వేలు అధికమైంది. మొత్తంమీద ఈ నూతన సంవత్సరంలో వెండి రూ.32 వేలు లేదా 13.4 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2025న రూ.2.39 లక్షలుగా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.2.71 లక్షలకు చేరుకున్నది.