మరింత తగ్గిన పుత్తడి.. రూ.10 వేలు పడిన తులం ధర
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం రూ.1.52 లక్షలకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్ పతనమవడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.
- 52 వేలు దిగొచ్చిన కిలో వెండి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం రూ.1.52 లక్షలకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్ పతనమవడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.12,800 లేదా 7.73 శాతం తగ్గి రూ.1,52,700కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,65,500గా ఉన్నది. గత మూడు సెషన్లలో పుత్తడి ధర రూ.30,300 లేదా 17 శాతం తగ్గినట్టు అయింది. జనవరి 29న రికార్డు స్థాయి రూ.1.83 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి అంతే వేగంతో కిందికి పడిపోయింది. కిలో వెండి ఏకంగా రూ.52 వేలు(17 శాతం) తగ్గి రూ.2.60 లక్షలకు దిగొచ్చింది. గత శనివారం వెండి రూ.72,500 తగ్గిన విషయం తెలిసిందే. గత మూడు సెషన్లలో కిలో వెండి ఏకంగా రూ.1.44 లక్షలు లేదా 36 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, డాలర్ విలువ మరింత బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపుపై అనిశ్చితి నెలకొనడం ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,690 డాలర్లు, వెండి 77 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

