Gold Rates | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. ప్రస్తుత పండుగ సీజన్కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో గడిచిన రెండు రోజుల్లో పుత్తడి ధర రూ.1,000 ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర మరో రూ.500 పెరిగి రూ.74,600 పలికింది. అంతకుముందు ఈ ధర రూ.74,100గా ఉన్నది. బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో కిలో వెండి రూ.500 అధికమై రూ.85 వేలకు చేరుకున్నది.
ఇటు హైదరాబాద్లో 22 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.380 అధికమై రూ.67,150కి చేరుకోగా, 24 క్యారెట్ ధర రూ.410 ఎగబాకి రూ.73,250కి చేరుకున్నది. అలాగే కిలో వెండి రూ.500 ఎగబాకి రూ.91,500 పలికింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర 2,550.90 డాలర్లు పలుకగా, వెండి 29.11 డాలర్లకు చేరుకున్నది.