Gold Price | న్యూఢిల్లీ, ఆగస్టు 9: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయంగా పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.72,450 పలికింది. పెరగముందు ధర రూ.71,350గా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా పెరిగింది.
కిలో వెండి ఏకంగా రూ.1,400 అధికమై రూ.82,500కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.820 అధికమై రూ.70,090కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.750 ఎగబాకి రూ.64,250కి చేరుకున్నది. రూ.1,800 అధికమైన కిలో వెండి రూ.88 వేలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5.60 డాలర్లు పెరిగి 2,468.90 డాలర్లకు చేరుకోగా, వెండి 27.60 డాలర్ల వద్ద ఉన్నది.