హైదరాబాద్లో రూ. 54 వేలకు చేరువలో పుత్తడి
న్యూఢిల్లీ, మార్చి 7: బంగారం పరుగందుకున్నది. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న పుత్తడి ఒకేరోజు భారీగా పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు భగ్గుమనడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడం ఇందుకు కారణం. న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర రూ.1,300 అధికమై రూ.53,780గా నమోదైంది. అటు హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54 వేలకు చేరువైంది. రూ.1,090 ఎగబాకి రూ.53,890కి చేరుకున్నది. 22 క్యారెట్ల పుత్తడి కూడా రూ.1,000 అధికమై రూ.49,400 వద్ద నిలిచింది. వెండి రూ. 2,300 ఎగబాకి రూ.75,700కి చేరింది.