Gold Price | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ పెరగడంతో పుత్తడి ధర (Gold Price) సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నడుమ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,07,550కు చేరిందని ఇండియా బుల్లియన్స్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం తులం ధర రూ.1,07,070గా ఉన్నది.
బంగారం ధరలు వరుసగా పెరుగడం ఇది ఎనిమిదో సారి. 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000 పెరిగి తులానికి రూ.1,06,200 పెరిగింది. ఇక వెండి ధర కిలోకు రూ.1,26,100 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఆల్ టైమ్ హై 3,547.09 డాలర్లకు చేరింది. గతేడాది ఆగస్టు 31 పుత్తడి ధర అత్యధికంగా రూ.1,03,910కు చేరింది. అనంతరం నవంబర్ 15 నాటికి రూ.74,240కు తగ్గింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ.. రూ.లక్ష 7 వేలు దాటి సరికొత్త రికార్డు వైపు పరుగులు పెడుతున్నది. ఇక కిలో వెండి రూ.1,25,520గా ఉన్నది. శుక్రవారం అది మరింత పెరిగి రూ.1,25,735కు చేరుతుందని ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.
ఢిల్లీ- రూ.1,07,170
ముంబై- రూ.1,07,350
బెంగళూరు- రూ.1,07,440
కోల్కతా- రూ.1,07,210
చెన్నై- రూ.1,07,670