Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ తగ్గుతున్నది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.350 తగ్గి రూ.60,150 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇంతకుముందు ట్రేడింగ్లో రూ.60,500 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.74 వేల వద్ద నిలిచింది.
గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఔన్స్ బంగారం ధర 1912 డాలర్లు, ఔన్స్ వెండి 22.50 డాలర్లు పలుకుతున్నది. గత వారం వచ్చిన లాభాల నుంచి లబ్ధి పొందడంలో బంగారం వెనుక బడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.393 తగ్గి రూ.59,015 వద్ద స్థిర పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ బంగారం కాంట్రాక్ట్స్ ధర రూ.393 (0.66శాతం) తగ్గి రూ.59,015 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.83 శాతం తగ్గి 1925.40 డాలర్ల వద్ద ట్రేడయింది.