హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి, పరిశోధనలను ఆచరణాత్మక పరిషారాలుగా మార్చేందుకు అకాడమీ-పరిశ్రమ-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. బిట్స్ పిలానీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ), పుణే సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే-2026’ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సాంకేతిక రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. బిట్స్ పిలానీ వీసీ ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు మాట్లాడుతూ.. జాతీయ పరిశోధనలను జాతీయ సామర్థ్యాలుగా మార్చడంలో అకాడమీ-ఇండస్ట్రీ భాగస్వామ్యం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్ పిలానీ, డీఐఏటీ పుణే, ప్రముఖ రక్షణ-ఏరోస్పేస్ సంస్థల మధ్య 20 ఎంవోయూలు కుదిరాయి.