Gold – Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,100 తగ్గి రూ.71,700లకు పతనమైంది. సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,800 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కిలో వెండి ధర వరుసగా నాలుగో రోజు రూ.2,200 నష్టపోయి రూ.82 వేలకు చేరుకున్నది. సోమవారం కిలో వెండి ధర రూ.84,200 పలికిన సంగతి తెలిసిందే. ఈ నెల రెండో తేదీ నుంచి కిలో వెండి ధర రూ.4200 తగ్గింది.
రిటైల్ కొనుగోలు దారులు, జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ బలహీనతలు, త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితి, మరోవైపు కేంద్రీయ బ్యాంకు డిమాండ్, తక్కువ వడ్డీరేట్లతో బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని దిలీప్ పర్మార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 20 డాలర్లు తగ్గి 2409 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 26.94 డాలర్లకు దిగి వచ్చింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపు నెమ్మదిగా సాగవచ్చునని భావిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం ముప్పు భయాలతో బంగారం ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!