Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో స్థానికుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 వృద్ధి చెంది రికార్డు గరిష్ట స్థాయికి చేరువైంది. శుక్రవారం తులం బంగారం ధర రూ.82,000 పలికింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.81,300 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర వరుసగా మూడో రోజూ రూ.700 వృద్ధితో 81,600 ముగిసింది. గురువారం 99.5శాతం స్వచ్చత గల బంగారం తులం ధర రూ.80,900 వద్ద స్థిర పడింది. మరోవైపు, శుక్రవారం కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ. 93,500 వద్ద ముగిస్తే, బుధవారం రూ.94,000 వద్ద స్థిర పడింది. గతేడాది అక్టోబర్ 31న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,400, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,000లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణులు నెలకొన్నా, దేశీయంగా జ్వువెల్లర్లు, వ్యాపారుల నుంచి అధిక డిమాండ్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం ధర రూ.424 (0.54 శాతం) తగ్గి రూ.78,802 వరకూ పెరిగి ముగింపు సమయానికి రూ.78,800లకు చేరుకుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఉపాధ్యక్షులు జతిన్ త్రివేది చెప్పారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతోపాటు ద్రవ్యోల్బణంతోపాటు అమెరికా డేటా పాజిటివ్‌గా ఉండటంతో బంగారం ధర పెరుగుదలపై ఆశలు పెరిగాయన్నారు. ఎంసీఎక్స్‌లో శుక్రవారం కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.1,093 (1.18 శాతం) తగ్గి రూ.91,710 పలికింది.
అంతర్జాతీయంగా, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 21.10 డాలర్లు (0.77 శాతం) తగ్గి 2,729.80 డాలర్లకు చేరుకుంది. యూఎస్ హౌసింగ్ అండ్ ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ డేటా రానున్న నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 2,750 డాలర్ల దిగువకు పడిపోయిందని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ కాయ్నాత్ చెయిన్వాలా తెలిపారు. ఎకనమిక్ డేటా బలహీన పడితే ఈ ఏడాది మూడు లేదా నాలుగు సార్లు వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని యూఎస్ ఫెడ్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయన్నారు. మరోవైపు, కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో 1.47 శాతం తగ్గి ఔన్స్ వెండి ధర 31.26 డాలర్లకు చేరుకుంది.