న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగారం ధర ( Gold price ) వరుసగా రెండో రోజూ పెరిగింది. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.222 పెరిగి రూ.45,586కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం బంగారం ధర రూ.45,364 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర పెరుగడం, రూపాయి మారకం విలువ కొంత బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.100 పెరిగి రూ.61,045 పలికింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.60,945 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,757 అమెరికన్ డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 23.30 అమెరికన్ డాలర్లు పలికింది. ఇదిలావుంటే ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కూడా డాలర్‌తో పోల్చితే మూడు పైసలు తగ్గి రూ.74.28కి చేరింది.