Gold – Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం భారీగా బంగారం ధరలు తగ్గాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) రూ.3702 తగ్గింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ పెంచారు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) ఆగస్టు గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం రూ.3702 తగ్గి (5.09 శాతం0 రూ.69,016లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర సెప్టెంబర్ డెలివరీ రూ.4704 తగ్గి రూ.84,499లకు దిగి వచ్చింది.
నగరం – 22 క్యారట్స్ – 24 క్యారట్స్ – 18 క్యారట్స్ (రూ)
చెన్నై – 65,500 – 71,460 – 53,650
ముంబై – 64,950 – 70,860 – 53,140
ఢిల్లీ – 65,100 – 71,01- 53,270
కోల్కతా – 64,950 – 70,860 -53,14
బెంగళూరు- 64,950 -70,860 – 53,140
హైదరాబాద్ – 64,950 – 70,860 – 53,140