Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు దేశీయ బులియన్ మార్కెట్లోనూ కొనసాగుతున్నాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.80 వేల మార్క్ వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.600 తగ్గి రూ.94,000 వద్ద నిలిచింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,600 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.450 తగ్గి రూ.79,150 వద్ద నిలిచింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,600 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగి వస్తు్న్నాయి. ఔన్స్ బంగారం ధర 2685 డాలర్లు పలికింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డాలర్లు, యూఎస్ బాండ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో బంగారానికి గిరాకీ కాసింత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2700 డాలర్లు దాటింది. కామెక్స్ ఫ్యూచర్ లో ఔన్స్ బంగారం ధర రెండు శాతం తగ్గి రూ. 2,694.30 పలికింది. కామెక్స్ సిల్వర్ ప్యూచర్ ధర 31.52 డాలర్లకు చేరుకున్నది.