హైదరాబాద్, నవంబర్ 10: బస్సు టికెట్ల బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్.. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. టికెట్ బుక్ చేసుకున్నవారు బంగారు నాణేలను గెలుచుకునే అవకాశం కల్పించింది.
లక్కీ డ్రా ద్వారా రోజూ 10 గ్రాముల నాణెన్ని గెలుచుకోవచ్చునని తెలిపింది. దీపావళి, పెండ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ స్వల్పకాల ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది.