Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.300 పెరిగి రూ.79 వేల మార్కును దాటేసి రూ.79,150 వద్ద స్థిర పడింది. బుధవారం 78,850 వద్ద ముగిసింది. రిటైలర్లు, జ్యువెల్లరీ ఆభరణాల తయారీ దారుల నుంచి గిరాకీ పెరగడంతో బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. మరోవైపు కిలో వెండి ధర మూడో రోజు పెరిగింది. గురువారం కిలో వెండి ధర రూ.1,300 వృద్ధితో రూ.93,800 పలికింది. బుధవారం కిలో వెండి రూ.92,500 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం ధర రూ.160 తగ్గిపోయి రూ.76,932 వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూ.76,700-77,400 మధ్య తచ్చాడింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.188 తగ్గి రూ.93,105 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 7.20 డాలర్లు వృద్ధి చెంది, 2,669 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 0.27 శాతం తగ్గి 31.93 డాలర్లకు చేరుకున్నది.