న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గతవారంలో భారీగా పుంజుకున్న ఈ రెండు అత్యంత విలువైన లోహాల ధరలు సోమవారం భారీగా తగ్గాయి. కిలో వెండి అయితే ఏకంగా రూ.1,800 తగ్గి రూ.2.45 లక్షలకు దిగొచ్చింది.
అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.300 తగ్గి రూ.1.55 లక్షలకు దిగొచ్చిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.