Gold Rates | న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో పుత్తడి ధర మళ్లీ 80 వేల దిగువకు పడిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో శుక్రవారం ఒకేరోజు తులం పుత్తడి రూ.1,400 తగ్గి రూ.79,500కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ఇది రూ.80,900గా ఉన్నది. ఇటు హైదరాబాద్‌లోనూ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.78,870కి దిగిరాగా, 22 క్యారెట్ ధర రూ.550 తగ్గి రూ.72,300కి దిగొచ్చింది.
వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో రూ.4,200 తగ్గి రూ.92, 800గా నమోదైంది. హైదరాబాద్‌లోనూ రూ. 3,000 తగ్గి రూ.1,01,000గా నమోదైంది.