హైదరాబాద్, ఆగస్టు 20 : గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కొత్తగా మార్కెట్లోకి మొక్కజొన్న పంట కోసం కలుపు నివారణ మందు ఆశితాకాను ఆవిష్కరించింది. ఐఎస్కే జపాన్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ మందుతో దేశీయ మొక్కజొన్న రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య గడ్డి, వెడల్పాటి ఆకులు గల కలుపును సమర్థవంతంగా నియంత్రించేందుకు ఈ వినూత్న ఉత్పత్తి ఉపయోగపడనున్నది.
పంట ప్రారంభ దశలో కలుపు పెరిగిపోవడం వల్ల మొక్కజొన్న దిగుబడి గణనీయంగా ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలో 2-4 కలుపు ఆకుల దశలో ఎకరాకు 50 ఎంఎల్ ఆశితాకాను, 400 ఎంఎల్ సర్పెక్టెంట్ను వాడితే కలుపును పూర్తిగా నియంత్రించవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.