హైదరాబాద్ నుంచి ఆకాశ విమాన సేవలు
చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజాగా హైదరాబాద్‌లో తన విమాన సేవలు ప్రారంభించింది.
- నేటి నుంచి గోవా,బెంగళూరులకు సర్వీసులు
హైదరాబాద్, జనవరి 24(బిజినెస్ బ్యూరో):చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజాగా హైదరాబాద్‌లో తన విమాన సేవలు ప్రారంభించింది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి గోవాకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 12.30 గంటలకు బయలుదేరనున్న క్యూపీ 1415 విమాన సర్వీసు గోవాకు 1.45 గంటలకు చేరుకోనున్నది. తిరిగి గోవాలో 2.20 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 3.35 గంటలకు చేరుకోనున్నది. హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 4.15 గంటలకు బయలుదేరనున్న క్యూపీ 1418 సర్వీసు బెంగళూరుకు సాయంత్రం 5.25 గంటలకు చేరుకోనున్నది.
ఈ రూట్లలో ప్రయాణించేవారు అధికంగా ఉండటంతో రోజువారి సర్వీసులను ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ అధికారి ప్రవీణ్ ఐయర్ తెలిపారు. దీంతో కంపెనీ 13వ రూట్లో విమాన సేవలు ఆరంభించినట్లు అయిందన్నారు. అలాగే వచ్చే నెల 15 నుంచి బెంగళూరు-హైదరాబాద్-బెంగళూరుల మధ్య మరో రెండు విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించడానికి సంస్థ ఊవ్విళ్లూరుతున్నదని, ఇందుకోసం ప్రతి పదిహేను రోజులకొక నూతన విమానాన్ని జత చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ 14 విమానాలతో సేవలు అందిస్తుండగా..వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 18కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Bangalore
- Flights
- Goa
- Praveen Iyer
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

