జీఎమ్మార్ చేతికి నాగపూర్ ఎయిర్పోర్ట్
జీఎమ్మార్ మరో విమానాశ్రయాన్ని చేజిక్కించుకున్నది. దేశీయంగా ఇప్పటికే పలు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థ తాజాగా నాగపూర్ విమానాశ్రయం కూడా చేరింది. నాగపూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ 30 ఏండ్ల పాటు నిర్వహించనున్నట్టు జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 26 : జీఎమ్మార్ మరో విమానాశ్రయాన్ని చేజిక్కించుకున్నది. దేశీయంగా ఇప్పటికే పలు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థ తాజాగా నాగపూర్ విమానాశ్రయం కూడా చేరింది. నాగపూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ 30 ఏండ్ల పాటు నిర్వహించనున్నట్టు జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, ఈ ఎయిర్‌పోర్ట్‌ను వరల్డ్-క్లాస్ ఏవియేషన్ హబ్‌గా తీర్చనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇందుకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. జీఎమ్మార్ నాగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఎన్ఐఏఎల్) విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల నిమిత్తం గరిష్ఠంగా మూడు కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేయాల్సివుంటుందని పేర్కొంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ టర్మినల్, మౌలిక సదుపాయాల అధునీకరణ, కార్గొ సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ సేవలను కూడా ఆధునీకరించనున్నది. ప్రస్తుతం జీఎమ్మార్…ఢిల్లీ, హైదరాబాద్, గోవా, నాగపూర్, బీదర్, ఇండోనేషియాలోని మెడాన్ విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

