న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: జీఎమ్మార్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2,469.71 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్లను ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. జీఎమ్మార్ గ్రూపునకు చెందిన జీఎమ్మార్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్(జీఎస్ఈడీపీఎల్)కు ఈ ప్రాజెక్టునకు సంబంధించి లేటర్ ఆఫ్ అవార్డ్(ఎల్వోఏ) అందుకున్నది. ఈ ఆర్డర్ ప్రకారం ఆగ్రా, అలిఘర్ జోన్లలో 25.52 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును 27 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.