హైదరాబాద్, మే 23: జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానిగాను సంస్థ రూ.253 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చినట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.168 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,570 కోట్ల నుంచి రూ.2,977 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుతం సంస్థ ఢిల్లీ, హైదరాబాద్, మోపా(గోవా) ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహిస్తున్నది.